Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (31/05/2023)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.

Updated : 31 May 2023 04:08 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

శుభ ఫలితాలు ఉంటాయి. ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. నూతన వస్తువులను కొంటారు. ఆదిత్య హృదయం చదవాలి.

అవసరానికి తగిన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకండి. అందరినీ కలుపుకొనిపోతే తొందరగా విజయాన్ని అందుకుంటారు. మంచి భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టదైవ నామస్మరణ శక్తిని ఇస్తుంది.

ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. ఈశ్వర ధ్యాన శ్లోకం చదివితే బాగుంటుంది.

అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధు,మిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. శని శ్లోకం చదివితే బాగుంటుంది.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమం.

ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఒక కీలక విషయంలో మీ ఆలోచనాధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభ కాలం. దుర్గాదేవి సందర్శనం శుభప్రదం.

మిశ్రమకాలం. అప్పగించిన పనుల్లో చురుగ్గా పాల్గొనటం ద్వారా పనులు త్వరగా పూర్తవుతాయి. వృథా ప్రసంగాలతో లేనిపోని తలనొప్పులు వస్తాయి. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. దుర్గారాధన శుభప్రదం.

మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. ఉమామహేశ్వర స్తోత్రం చదివితే మంచిది.

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబ సహకారం ఉంటుంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.

 

బుద్ధిబలంతో వ్యవహరించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. అనవసర ఆలోచనలతో కాలాన్ని వృథా చేయకండి. కొందరు మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. వృథా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. దుర్గా సందర్శనం శుభప్రదం.

ముఖ్య వ్యవహారాల్లో స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి. అనవసర విషయాలలో సమయాన్ని వృథా చేయకండి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. 

శుభ ఫలితాలు ఉన్నాయి. కాలం సహకరిస్తుంది. మీ మీ రంగాలలో విజయం సాధిస్తారు. కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు