Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/11/2023)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Updated : 21 Nov 2023 06:43 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ప్రారంభించిన పనిలో విజయం సిద్ధిస్తుంది. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థికంగా బలపడతారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణాలు కలిసివస్తాయి. శ్రీఆంజనేయస్వామి దర్శనం మేలు చేస్తుంది.

స్వల్ప ప్రయత్నంతో గొప్ప కార్యక్రమాలను పూర్తి చేస్తారు.పెద్దల సూచనలతో పనులు త్వరగా పూర్తవుతాయి. కుటుంబ అభివృద్ధి కోసం మీరు చేసే కృషి ఫలిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శివారాధన శుభప్రదం.

ప్రారంభించబోయే పనుల్లో ప్రయత్న బలాన్ని పెంచాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తే లక్ష్యం నెరవేరుతుంది. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆర్థికపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. శ్రీరామ నామాన్ని జపించాలి.

అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. ప్రారంభించిన కార్యక్రమాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో పూర్తి చేస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. సమాజంలో గౌరవం తగ్గకుండా కాపాడుకోవాలి. ఆర్థికపరంగా జాగ్రత్తలు అవసరం. శ్రీలక్ష్మీ స్తుతి శుభప్రదం.

ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేస్తారు. చేపట్టే పనుల్లో అవగాహన లోపం లేకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యమైన విషయంలో అనుభవజ్ఞులు సూచనలను తీసుకోవడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాలు కలిసి వస్తాయి. విష్ణుమూర్తిని ధ్యానించండి.

మీదైన రంగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. స్వల్ప ప్రయత్నంతోనే విజయం వరిస్తుంది. ఆర్థికపరమైన అభివృద్ధి సాధిస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుప్రీతి ఉంది. శివారాధన వల్ల మరింత మేలు జరుగుతుంది.

ప్రతీ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అనుకున్నది సాధించే వరకు పోరాటం ఆపకండి. తోటి వారి సహకారంతో ఒక పని పూర్తవుతుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. హనుమాన్ చాలీసా చదవండి.

వ్యాపారంలో శ్రద్ధగా పనిచేయడం ద్వారా లాభాలు వస్తాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనోధైర్యంతో ఎదుర్కొంటారు. అనవసర ఖర్చులు సూచితం. ప్రయాణాల్లో జాగ్రత్త. అప్పులు ఇబ్బంది పెడతాయి. రుణ విమోచన అంగారక స్తోత్రం చదివితే మేలు జరుగుతుంది.

శుభకాలం. ఆలోచనలు వికసిస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. మీ ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించండి.

 

తోటివారి సహకారంతో పనులను పూర్తి చేస్తారు. అస్థిరబుద్ధి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. తోటి వారి సలహాలతో చక్కటి ఫలితాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులను ప్రేమ భావంతో చూడడం ద్వారా చక్కటి ఫలితాలు వస్తాయి. ఆదిత్య హృదయం చదివితే మంచిది.

సంపూర్ణ మనోబలంతో విజయాలు సాధిస్తారు. చాప కింద నీరు లాగా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. కలహాలతో కాలం వృథా చేయకండి. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సలహాలు ఉపయోగపడతాయి. శ్రీగణపతిని ధ్యానించండి.

మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. ముందస్తు ప్రణాళికలతో శ్రమ తగ్గుతుంది. వ్యాపార పరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయి. ఆదిత్య హృదయ పారాయణం మేలు చేస్తుంది.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని