Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/10/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
ప్రారంభించబోయే పనుల్లో అలసట చెందకుండా చూసుకోవాలి. తోటివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనః పీడ ఉంది. మానసిక ప్రశాంతత కోసం శివ నామాన్ని జపించడం ఉత్తమం.
శుభకాలం. అసాధారణ పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ఇష్టదైవారాధన శుభప్రదం.
పనిలో శ్రమ పెరుగుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. ఒక వార్త మనఃశ్శాంతిని తగ్గిస్తుంది. శ్రీఆంజనేయస్వామి దర్శనం శుభకరం.
గ్రహబలం విశేషంగా ఉంది. శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన శ్రేయస్కరం.
ప్రారంభించిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం.
ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఊహించిన ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శివనామాన్ని జపించాలి.
లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు అవసరం అవుతాయి. ఉద్యోగంలో మీ పై అధికారుల సహకారం ఉంటుంది. సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. దుర్గాధ్యానం శుభప్రదం.
ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్నీ సర్దుకుంటాయి. సూర్య ఆరాధన శుభప్రదం.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆరోగ్య పరిరక్షణ అవసరం. లక్ష్మీధ్యానంతో మనోబలం పెరగడంతో పాటు శుభకరం.
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పరమశివుడిని ఆరాధిస్తే మంచిది.
మీ మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. కీలక విషయాలను కొన్నాళ్లపాటు వాయిదా వేసుకుంటే మంచిది. కలహసూచన ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి.ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది.
ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మంచి సమయం. మొదలు పెట్టిన పనులను బుద్ధిబలంతో చక్కగా పూర్తిచేయగలుగుతారు.ఇష్టదైవారాధన శుభప్రదం.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TS News: ఆరు గ్యారంటీల్లో 2 పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్
అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/12/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
TS News: ఆరు గ్యారంటీల్లో 2 పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్
-
IND vs SA: సఫారీలతో టీ20 సిరీస్.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
-
Swiggy - Zomato: స్విగ్గీ, జొమాటోతోనే మాకు పోటీ: ఎడిల్విస్ సీఈఓ
-
BRS: ఎమ్మెల్సీలుగా పల్లా, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా
-
వారి అంకితభావానికి ఆశ్చర్యపోయా.. టాలీవుడ్ ప్రముఖులపై నెట్ఫ్లిక్స్ కో-సీఈవో పోస్టు
-
Telangana Assembly: అసెంబ్లీ సమావేశాలు వాయిదా.. స్పీకర్ ఎన్నిక అప్పుడే