Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/09/23)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది.  డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.

Updated : 27 Sep 2023 00:37 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకు పోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ వద్దు. ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది.

ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే తప్పక విజయం సిద్ధిస్తుంది. చేసే పనిలో తడబాటు రానీయకండి. మనోధైర్యంతో చేసే పనులు విజయాన్నిస్తాయి. కలహాసూచన ఉంది. ఆవేశపూరిత నిర్ణయాలు వద్దు. దుర్గా అష్టోత్తర శతనామావళి పఠిస్తే మంచిది.

మధ్యమ ఫలితాలున్నాయి. బంధుమిత్రులను కలుపుకొని పోవడం వలన సమస్యలను అధిగమించగలుగుతారు. సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్లడం మంచిది. అనవసరమైన ఆందోళన తగ్గించుకుంటే మంచిది. దుర్గ స్తోత్రం పఠించాలి.

కీలక వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

తలపెట్టిన పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి ప్రశంసలను పొందుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. విష్ణు నామ స్మరణ ఉత్తమ ఫలాలను ఇస్తుంది.

మీ మీ రంగాల్లో అనుకూలఫలితాలున్నాయి. మీరు ఊహించినదానికంటే అధిక ధనలాభాన్ని పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన పనులలలో ముందడుగు పడుతుంది. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. శివారాధన మేలు చేస్తుంది.

మధ్యమ ఫలితాలున్నాయి. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్తితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది.

ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే తప్పక విజయం సిద్ధిస్తుంది. చేసే పనిలో తడబాటు రానీయకండి. మనోధైర్యంతో చేసే పనులు విజయాన్నిస్తాయి. కలహాసూచన ఉంది . ఆవేశపూరిత నిర్ణయాలు వద్దు . దుర్గా అష్టోత్తర శతనామావళి పఠిస్తే మంచిది.

పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో ఆటంకాలను అధికమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవ స్తోత్రాన్ని చదవడం మంచిది.

 

బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మీ మీ రంగాల్లో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శివ నామస్మరణ చేస్తే మేలు.

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్దంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది.  మీ పనితీరుకు, ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది. శని శ్లోకం చదవండి.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని