Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/09/2023)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది.  డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 21 Sep 2023 00:10 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

వృథా ఆలోచనలతో కాలాన్ని జాప్యం చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.

మంచి కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. ఈశ్వర ధ్యానం శుభప్రదం.

ప్రారంభించభోయే పనుల్లో పట్టుదల వదలకండి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు. 

ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ఆర్థికవృద్ధి ఉంది. నారాయణ మంత్రాన్ని జపించాలి.

శ్రమ అధికం అవుతుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. మనసుపెట్టి పనిచేస్తే విజయం మీదే. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఈశ్వర ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారం అవుతుంది. శ్రీవేంకటేశ్వరుని నామస్మరణ మేలు చేస్తుంది.

ఒక వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇష్టదైవ సందర్శనం మేలు చేస్తుంది.

కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ  అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధువులతో మాట పట్టింపులకు పోవద్దు. శనిశ్లోకం చదవాలి.

ధర్మసిద్ధి ఉంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. చేపట్టిన పనులను పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది.

 

సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. గొప్పవారిని కలుస్తారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆదిత్య హృదయం చదవాలి.

శుభకాలం నడుస్తోంది. సమయాన్ని మంచి పనులకు ఉపయోగించండి. అభివృద్ధి సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

కొన్ని సంఘటనలు మనోబలాన్ని తగ్గించేలా ఉంటాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవమిస్తే మంచిది. కోపానికి గురికాకండి. నవగ్రహ శ్లోకాలను చదివితే మంచి జరుగుతుంది.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు