Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (22/09/2023)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 22 Sep 2023 00:13 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చంద్ర ధ్యానశ్లోకం చదివితే మంచి జరుగుతుంది.

మంచి పనులు చేపడతారు. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.

మనఃస్సౌఖ్యం ఉంది. భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమం.

కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

కొన్ని కీలక వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. పెద్దలతో కాస్త సంయమనంతో ఆచితూచి వ్యవహరించాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది.

మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. బంధు,మిత్రులను కలుస్తారు. కీలక వ్యవహారాలను వారితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహకారం ఉంటుంది. శ్రీప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. శత్రువుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. అధికారుల వద్ద అణిగిమణిగి ప్రవర్తించాల్సి ఉంటుంది. మీరు చేయని పొరపాటుకు నింద పడాల్సి రావచ్చు. బంధు,మిత్రులతో కొన్ని వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. ఇష్టదేవత స్తోత్రం చదవడం మంచిది.

మీ కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. బద్ధకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ దరిచేరనీయకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

మీ మీ రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. మీ భుజాన కొత్త బాధ్యతలు పడతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే బాగుంటుంది.

 

మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక  విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. శ్రీచంద్రశేఖరాష్టకం శుభప్రదం.

అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. కీలక విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. శ్రీదుర్గా స్తోత్రం చదవాలి.

కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పై అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచల బుద్ధిని వీడాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. విష్ణు సహస్రనామ పారాయణ శ్రేయోదాయకం.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని