Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారంలో అనుకూలత కలదు. గోసేవ చేయడం మంచిది.
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పనులకు ఆటంకం కలుగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతం అవుతాయి. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవి చేసుకోవడం సరికాదు. దుర్గారాధన శుభప్రదం.
మంచికాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొని పోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ వద్దు. ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది.
కాలం అన్నివిధాలా సహకరిస్తోంది. గౌరవ సన్మానాలు అందుకుంటారు. వృత్తి,వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. మిత్ర జన సహకారం ఉంది. శ్రీలక్ష్మీస్తుతి శ్రేయస్కరం.
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి.బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.
ఆశించిన ఫలితం దక్కుతుంది. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మనసు చెడు అంశాలపైకి మళ్లకుండా జాగ్రత్తపడాలి. దుర్గాస్తుతి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి ముందుకు సాగాలి. గిట్టనివారు మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. అర్హతకు తగిన ఫలితాలు అందుకుంటారు. శ్రీవేంకటేశ్వర సందర్శనం ఉత్తమం.
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విష్ణు నామస్మరణ శుభప్రదం.
శ్రేష్ఠమైన కాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులు చకచకా పూర్తవుతాయి. ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న ఒక ఫలితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. దైవారాధన మానవద్దు.
బాగా కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీరు ఆశించిన ఫలితాలు రావాలంటే ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. బంధువుల అండదండలు ఉంటాయి. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.
మీదైన రంగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు. ఒక వార్త లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. సూర్య నమస్కారాలు చేయడం మంచిది.
మంచి పనులు చేస్తారు. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీకు అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆగ్రహఆవేశాలకు పోవద్దు. తోటివారితో సానుకూలంగా వ్యవహరిస్తే మేలు. శనిధ్యానం చేయాలి.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి దర్శనం చేసుకున్నారు. -
గ్రానైట్‌పై విద్యుత్తు పిడుగు
‘బాపట్ల జిల్లా మార్టూరులో 400, బల్లికురవలో 200, సంతమాగులూరులో 90, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 120, ప్రకాశం జిల్లాలో 800 వరకు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి.’ -
‘అన్ని మండలాల్లోనూ కరవు’
జిల్లావ్యాప్తంగా తీవ్ర దుర్భిక్షం నెలకొందని, తక్షణం అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవన్లో గురువారం సీపీఎం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/12/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
-
ఏడాదిగా తల్లి మృతదేహంతో ఇంట్లోనే అక్కాచెల్లెళ్లు..
-
ప్రభుత్వ మద్యంలో రంగునీళ్లు కలిపి విక్రయం.. రాజమహేంద్రవరంలో ఘటన
-
Special Trains: 10 ప్రత్యేక రైళ్ల పొడిగింపు
-
Hyderabad: హోటళ్లు తెరచుకోక ఇక్కట్లు
-
JEE Mains: జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు