Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/09/2023)

 Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Updated : 28 Sep 2023 05:44 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. సొంతింటి పనుల్లో ముందంజ వేయగలుగుతారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. దుర్గాధ్యానం శుభప్రదం.

మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. ఇష్టమైన వారితో  కాలాన్ని గడుపుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది. శ్రీమహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది. 

ప్రారంభించిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల సహకారం  ఉంటుంది. శివస్తోత్రం చదవడం మంచిది.

ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. శ్రీవేంకటేశ్వరుని పూజించడం వల్ల ఆపదలు తొలగుతాయి.

ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదైవారాధన శుభప్రదం.  

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.  ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. దైవారాధన మానవద్దు.

ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు.  కీలకమైన పనులను కొన్నాళ్ల పాటు వాయిదా వేయడమే మంచిది. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. దుర్గారాధన శుభప్రదం.

ప్రారంభించబోయే పనిలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. బంధువుల సహకారం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ముందుచూపు అవసరం. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు.

 

మీ మీ రంగాల్లో ఓర్పు,పట్టుదల చాలా అవసరం. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అవసరానికి మించిన ఖర్చులు ఉంటాయి. నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం.

పనులకు ఆటంకం ఎదురవకుండా చూసుకోవాలి. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. ధర్మకార్యాచరణతో మేలు చేకూరుతుంది. గోవిందనామాలు చదివితే బాగుంటుంది.

స్థిరమైన ఆలోచనలతో మంచి చేకూరుతుంది. ఒక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. దైవబలం ఉంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని