Dalitbandhu: 14,400 మంది ఖాతాల్లో దళితబంధు నిధులు జమ

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారులకు తీపి కబురు అందింది. 14,400 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10లక్షల చొప్పున ప్రభుత్వం ఇవాళ నిధులు జమ చేసింది..

Updated : 14 Sep 2021 22:08 IST

హైదరాబాద్‌: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారులకు తీపి కబురు అందింది. 14,400 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10లక్షల చొప్పున ప్రభుత్వం ఇవాళ నిధులు జమ చేసింది. వలస వెళ్లిన కుటుంబాల గురించి అధికారులు రీసర్వే చేస్తున్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఇప్పటికే మూడు విడతల్లో దళిత బంధు నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. మూడు విడతల్లో కలిపి మొత్తంగా రూ.1,200 కోట్లను లబ్ధిదారులకు అందజేసినట్లు కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని