TS NEWS: దళితబంధు దేశానికి దారి చూపుతుంది

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకం రాబోయే రోజుల్లో దేశానికి దారి చూపుతుందని టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, ప్రధాన

Published : 17 Aug 2021 01:39 IST

టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్‌

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకం రాబోయే రోజుల్లో దేశానికి దారి చూపుతుందని టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ అన్నారు. దేశంలోని దళితుల జీవనగతిని మార్చివేసే ఉజ్వలమైన పథకంగా చరిత్రకెక్కుతుందనే సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. దళితులు ఇకముందు వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగుతారని ధీమా వ్యక్తం చేశారు. దళిత బంధును ఒక పథకంగా మాత్రమే కాకుండా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోందని, ప్రభుత్వ నిబద్ధతను దళిత మేధావులు,సంఘాల నాయకులు అభినందిస్తున్నారని చెప్పారు.ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఇచ్చేరూ.10లక్షల్లో రూ.10 వేలు లబ్ధిదారుని వాటా కింద జమచేసి, మరో 10 వేలు ప్రభుత్వం కలిపి దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేస్తుందని, దళిత కుటుంబాల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా దళిత రక్షణ నిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న సుమారు 40 వేల మంది దళిత ఉద్యోగులకు కూడా దళితబంధు పథకాన్ని వర్తింప చేస్తామని హుజూరాబాద్ సభలో ప్రకటించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని