Published : 25 May 2022 01:42 IST

Viral Dance: వైరల్‌ అవుతున్న ఈ ‘హైటెక్‌-భారతీయం’ నృత్యం చూశారా...

ఇంటర్నెట్‌డెస్క్‌: కళల పుట్టినిల్లు అయిన భారతదేశంలో భరతనాట్యానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇక అమెరికాలో ప్రాముఖ్యం ఉన్న డాన్స్‌ ‘హిప్‌హాప్‌’. ఈ డాన్స్‌ ప్రదర్శన  ఉర్రూతలూగిస్తూంది. చూసేవారు సైతం కాలు కదిపేలా ఉంటుంది. ఈ రెండు రకాల డాన్స్‌లు వేటికవే ప్రాచుర్యం పొందాయి. ఈ రెండింటినీ కలిపితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది ఉష అనే కొరియోగ్రాఫర్‌కి. అంతే అనుకున్నదే మొదలుగా రెండింటినీ మేళవించిన ఓ కొత్త రకమైన డాన్స్‌ను కనిపెట్టింది. అలా డాన్స్‌ చేసి ఆ వీడియోని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. అంతే ఎల్లప్పుడూ కొత్తదనాన్ని కోరుకునే డిజిటల్‌ ప్రేక్షకులు ఆ వీడియోని లైకులు, షేర్లతో ముంచ్చేత్తారు. దీంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. డాన్స్‌లో ఓ కొత్త రకం ట్రైండ్‌ సెట్‌ చేశారని కొందరు, ఈ హైటెక్‌ భారతీయం డాన్స్‌కు ఫిదా అంటూ మరికొందరు కామెంట్‌ సెక్షన్‌ని పొగడ్తలతో నింపేశారు. 
‘రెండు రకాల డాన్స్‌లను నేను ప్రేమిస్తాను. ఇష్టపడతాను. అలాగే గౌరవిస్తాను. ప్రతి డాన్స్‌లోని తత్వాన్ని గ్రహిస్తూనే దానికి పూర్తి న్యాయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అదే నా లక్ష్యం’ అని ఈ వీడియో పోస్ట్‌ చేసిన కొరియోగ్రాఫర్‌ ఉష అన్నారు.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని