TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. పోలీసు కస్టడీకి విద్యుత్‌శాఖ డీఈ రమేశ్‌

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో విద్యుత్‌ శాఖ డీఈ పూల రమేశ్‌ను నాంపల్లి కోర్టు ఆరో రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. 

Published : 03 Jun 2023 22:47 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో విద్యుత్‌ శాఖ డీఈ పూల రమేశ్‌ను నాంపల్లి కోర్టు ఆరో రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. ఆదివారం నుంచి ఆరు రోజుల పాటు సిట్‌ అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు. మాస్‌కాపీయింగ్‌ వెనక ఇంకా ఎవరున్నారనేదానిపై కూపీ లాగనున్నారు.

వరంగల్ విద్యుత్ శాఖ డివిజినల్‌ ఇంజినీర్‌ (డీఈ)గా పనిచేసే రమేష్‌ ఏఈఈ, డీఏఓ పరీక్షకు సంబంధించిన 25 ప్రశ్నపత్రాలను విక్రయించినట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది. ఏఈఈ పరీక్షలో ఏడుగురు అభ్యర్థులకు పరీక్ష హాల్‌లోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ద్వారా డీఈ రమేష్‌ సమాధానాలు అందించినట్లు తేలడంతో సిట్‌ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. రమేశ్‌ ముఠా జనవరి, ఫిబ్రవరిలలో జరిగిన ఏఈఈ, డీఏవో పరీక్షల్లో ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ ద్వారా మాస్‌కాపీయింగ్‌ చేయించిన వ్యవహారం బయటపడడంతో సిట్‌ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. 

జనవరిలో జరిగిన స్త్రీ, శిశు సంక్షేమశాఖ సూపర్‌వైజర్‌ పరీక్ష సమయంలోనూ మాస్‌కాపీయింగ్‌ చేయించేందుకు రమేశ్‌ ప్రయత్నించినట్లు, సాంకేతిక కారణాల వల్ల అది విఫలమైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మాస్‌కాపీయింగ్‌ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసుకునేందుకు రమేశ్‌ను కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రమేశ్‌ను సిట్‌ కస్టడీకి అనుమతి ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని