Tractor Accident: ప్రత్తిపాడులో విషాద ఛాయలు

ట్రాక్టర్ బోల్తా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఏడుగురి మృతదేహాలను స్వస్థలమైన కొండేపాడు గ్రామానికి తీసుకొచ్చారు. దీంతో ఆ గ్రామంలో రోదనలు మిన్నంటాయి.

Updated : 05 Jun 2023 21:06 IST

వట్టిచెరుకూరు: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురిని స్వస్థలమైన ప్రత్తిపాడు మండలం కొండేపాటు తీసుకొచ్చారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇవాళ ఉదయం ట్రాక్టర్ పంటకాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ఏడుగురు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే. 20 మందికి గాయాలయ్యాయి. ముగ్గురు ఘటనాస్థలంలోనే మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు చనిపోయారు. ట్రాక్టర్‌లో సుమారు 40 మంది చేబ్రోలు మండలం జూపూడికి శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

దురదృష్టకర ఘటన: పవన్‌ కల్యాణ్‌

ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనలో ఏడుగురు మహిళలు దుర్మరణం పాలవ్వడం తీవ్ర ఆవేదన కలిగించిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ‘‘ శుభకార్యానికి వెళ్తున్న బృందం ప్రమాదం బారిన పడటం బాధాకరం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని