TS News: ముగిసిన‌ జూడాల చ‌ర్చ‌లు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా స‌మ్మె చేస్తున్న జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌(జూడా)తో ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఉన్న‌తాధికారి జ‌రిపిన చ‌ర్చ‌లు ముగిశాయి. ప్ర‌భుత్వం నుంచి త‌మ‌కు లిఖిత పూర్వ‌క హామీ ఇవ్వ‌లేద‌ని

Updated : 27 May 2021 14:36 IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా స‌మ్మె చేస్తున్న జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌(జూడా)తో ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఉన్న‌తాధికారి జ‌రిపిన చ‌ర్చ‌లు ముగిశాయి. ప్ర‌భుత్వం నుంచి త‌మ‌కు లిఖిత పూర్వ‌క హామీ ఇవ్వ‌లేద‌ని జూడాలు తెలిపారు. స‌మ్మె విర‌మ‌ణ‌పై ఈ సాయంత్రం నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు. కొన్ని డిమాండ్ల‌పై సానుకూలంగా స్పందించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఉత్త‌ర్వుల జారీకి రెండు రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని చెప్పిన‌ట్లు వివ‌రించారు. ప‌రిహారం విష‌యంలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయ‌ని ఉన్న‌తాధికారి తెలిపిన‌ట్లు చెప్పారు. ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌లిగించ‌కూడ‌ద‌నేదే త‌మ ఉద్దేశ‌మని.. అందుకే అత్య‌వ‌స‌ర సేవ‌లు కొన‌సాగిస్తున్నామ‌న్నారు.

జూడాల‌తో ప్ర‌భుత్వం త‌ర‌ఫున వైద్యారోగ్య కార్య‌దర్శి రిజ్వి చ‌ర్చ‌లు జ‌రిపారు. రిజ్వితో బీఆర్‌కే భ‌వ‌నంలో ఐదుగురు స‌భ్యుల బృందం చర్చించింది. ఈ సంద‌ర్భంగా త‌మ డిమాండ్ల‌ను జూనియ‌ర్ వైద్యుల సంఘం రిజ్వికి వివ‌రించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని