TG News: తెలంగాణ వైద్యారోగ్యశాఖలో వివిధ పోస్టుల భర్తీకి నిర్ణయం

వైద్య ఆరోగ్యశాఖలో వివిధ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 15 Jun 2024 20:18 IST

హైదరాబాద్‌: వైద్య ఆరోగ్యశాఖలో వివిధ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 531 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులను భర్తీ చేయడానికి  ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు ద్వారా ఈ ప్రక్రియ పూర్తి కానుంది. అలాగే.. 193 ల్యాబ్‌ టెక్నీషియన్‌, 31 స్టాఫ్‌ నర్సుల పోస్టుల భర్తీకి సైతం నోటిఫికేషన్‌ ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని