జీమెయిల్‌ నిండిపోయిందా.. ఖాళీ చేయండిలా

సాధారణంగా జీమెయిల్‌లో 15జీబీ స్టోరేజ్‌ లభిస్తుంది. అయితే నిరంతరం ఇందులో యాడ్లు, ప్రమోషన్లు, ఆఫీస్‌ మెయిల్స్‌ వస్తుంటాయి. మనం పనుల్లో పడి వాటిని చూడకపోవడంతో ఇన్‌బాక్స్‌ అనవసర మెయిల్స్‌తో నిండిపోయి ఉంటుంది.

Published : 22 Nov 2020 01:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా జీమెయిల్‌లో 15జీబీ స్టోరేజ్‌ లభిస్తుంది. అయితే నిరంతరం ఇందులో యాడ్లు, ప్రమోషన్లు, ఆఫీస్‌ మెయిల్స్‌ వస్తుంటాయి. మనం పనుల్లో పడి వాటిని చూడకపోవడంతో ఇన్‌బాక్స్‌ అనవసర మెయిల్స్‌తో నిండిపోయి ఉంటుంది. మరోవైపు స్టోరేజ్‌ లేమి సమస్య తలెత్తుతుంది. వీటిని ఒక్కొక్కటిగా డిలీట్‌ చేయాలంటే అంత సులువైన పని కాదు. అందుకే ఆ పనిని మరింత సులువు చేసేందుకు ఇక్కడ కొన్ని మార్గాలు తెలుసుకుందాం.

అన్ని మెయిల్స్‌ ఒకేసారి..
 

 

అన్ని మెయిల్స్‌ను ఒకేసారి డిలీట్‌ చేసేందుకు మొదట కంప్యూటర్లోకి వెళ్లి జీమెయిల్‌కు లాగిన్‌ కావాలి. తరువాత ఇన్‌బాక్స్‌లోకి వెళ్లాలి. అందులో పైన ఎడమవైపు చెక్‌బాక్స్‌పై క్లిక్‌ చేస్తే మొదటి పేజీలో ఉన్న 50 మెయిల్స్‌ సెలెక్ట్‌ అవుతాయి. ఇప్పుడు డిలీట్‌ ఐకాన్‌పై నొక్కితే ఈ పేజీలోని 50 మెయిల్స్‌ మాత్రమే డిలీట్‌ అవుతాయి. కానీ అన్ని పేజీల్లో ఉన్న మెయిల్స్‌ డిలీట్‌ కావు. 


 

ఇందు కోసం ఇప్పుడు పైన ‘సెలెక్ట్‌ ఆల్‌ కన్వర్వేషన్స్‌’ అనే ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని ఎంచుకుంటే అన్ని మెసేజ్‌లు సెలెక్ట్‌ అవుతాయి. ఇప్పుడు డిలీట్‌ ఐకాన్‌ నొక్కితే అన్ని మెయిల్స్‌ ట్రాష్‌లోకి వెళ్లిపోతాయి.

ఎంచుకున్న విభాగాల్లోనే


 

ఇలా కాకుండా ప్రత్యేకంగా కొన్ని విభాగాలను మాత్రమే డిలీట్‌ చేయాలనుకుంటే ఇన్‌బాక్స్‌లో పైన ఎడమ వైపు ఉన్న చెక్‌బాక్స్‌పై ‘డౌన్‌ యారో’ బటన్‌పై క్లిక్‌ చేయాలి. అప్పుడు రీడ్‌, అన్‌రీడ్‌, స్టార్డ్‌, అన్‌స్టార్డ్‌ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో ఏదో ఒకదానిపై క్లిక్‌ చేసి, తరువాత ఇంతకు ముందు లాగే ‘సెలెక్ట్‌ ఆల్‌ కన్వర్వేషన్స్‌’ ఎంచుకోవాలి. తద్వారా ఎంచుకున్న విభాగాల్లోని మెయిల్స్‌ను మాత్రమే డిలీట్‌ చేయొచ్చు.

ప్రమోషన్‌, సోషల్‌ మెయిల్స్‌

సాధారణంగా మన జీమెయిల్‌ ఇన్‌బాక్స్‌ యాడ్లు, ప్రమోషన్లు, సామాజిక మాధ్యమాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ల మెయిల్స్‌తో నిండిపోతుంది. వీటిని డిలీట్‌ చేసేందుకు మొదట ఇన్‌బాక్స్‌లోకి వెళ్లాలి. పైన ప్రమోషన్‌, సోషల్‌ మెయిల్‌లకు సంబంధించిన ఫోల్డర్‌లు కనిపిస్తాయి. వాటిలో ఏదో ఒక విభాగాన్ని ఎంచుకోవాలి. తరువాత ఇంతకు ముందు లాగే పైన ఎడమ వైపు ఉన్న చెక్‌బాక్స్‌పై క్లిక్‌ చేయాలి. దీంతో మొదటి 50 మెయిల్స్‌ సెలెక్ట్‌ అవుతాయి. తరువాత పైన ‘సెలెక్ట్‌ ఆల్‌ కన్వర్సేషన్స్’ ఆప్షన్‌ ఎంచుకుంటే అన్ని మెయిల్స్‌ సెలెక్ట్‌ అవుతాయి. తరువాత డిలీట్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. పై మూడు విధానాల్లో డిలీట్‌ చేసిన మెయిల్స్‌ ట్రాష్‌ ఫోల్డర్‌లో 30రోజులు ఉంటాయి. వాటిని పూర్తిగా డిలీట్‌ చేయాలనుకుంటే ఈ 30రోజుల్లోగా ట్రాష్‌ ఫోల్డర్‌లో డిలీట్‌ చేయాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని