Viral Video: స్టూడెంట్‌ డ్యాన్స్‌.. టీచర్‌ ఫాలోస్‌.. నెటిజన్స్‌ సర్‌ప్రైజ్‌!

స్కూల్లో ఎప్పుడూ పాఠాలేనా.. అప్పుడప్పుడూ తరగతి గదిలో టీచర్లు వైవిధ్యభరితమైన యాక్టివిటీస్‌ నిర్వహిస్తే పిల్లలు ఎంతో సంబరపడిపోతుంటారు......

Published : 29 Apr 2022 02:24 IST

దిల్లీ: స్కూల్లో ఎప్పుడూ పాఠాలేనా.. అప్పుడప్పుడూ తరగతి గదిలో టీచర్లు వైవిధ్యభరితమైన యాక్టివిటీస్‌ నిర్వహిస్తే పిల్లలు ఎంతో ఆనందంగా నేర్చుకుంటారు. అలాంటి టీచర్లను ఎంతగానో అభిమానిస్తారు.. ఆరాధిస్తారు కూడా. దిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ టీచర్‌ పిల్లలతో కలిసి సరదాగా చేసిన డ్యాన్స్‌ వీడియో వైరల్‌గా మారింది. తరగతి గదిలో విద్యార్థినితో కలిసి తాను వేసిన స్టెప్పుల వీడియోను ఉపాధ్యాయిని మను గులాటి తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘టీచర్లు పిల్లల్ని ఆప్యాయంగా చూసుకుంటే.. వారు కూడా అదే ప్రేమను పొందుతారు’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

తరగతి గదిలో ఇంగ్లీష్ క్లాస్‌ ముగియగానే మను గులాటి పిల్లలతో సరదాగా డ్యాన్స్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తొలుత ఓ విద్యార్థిని సాంగ్‌’కి డ్యాన్స్‌ చేస్తుండగా టీచర్‌ ప్రోత్సహించారు. అయితే, అక్కడి పిల్లల్లో ఒకరు టీచర్‌కు స్టెప్పులు నేర్పించాలని కోరగా.. అది విన్న టీచర్‌ పక్కనే డ్యాన్స్‌ చేస్తున్న విద్యార్థినిని అనుకరిస్తూ స్టెప్పులు వేశారు. దీంతో విద్యార్థులంతా చప్పట్లతో ఉత్సాహపరచడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్ని ప్రోత్సహించేలా ఆమె కృషిని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

‘సరిహద్దులు లేని ఇలాంటి బోధన నిజంగా అద్భుతం’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మీలా అంకితభావంతో ఉంటే.. తరగతి గదిలో నేర్చుకోవడం సరదాగా, ప్రేరణనిచ్చేదిగా ఉంటుందంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ‘చాలా అద్భుతం మేడం.. తరగతిగది కార్యకలాపాల్లో పూర్తిస్థాయిలో పాల్గొంటే విద్యార్థులు చాలా నేర్చుకోగలుగుతారు’. టీచర్‌, స్టూడెంట్‌ మధ్య ఇలాంటి పరిపూర్ణ సంబంధాన్ని చూడటం చాలా అభినందనీయం. గొప్ప ఉపాధ్యాయుడే గొప్ప విద్యార్థుల్ని తయారు చేయగలడు.. టీచర్ల సపోర్టు నుంచే కాన్ఫిడెన్స్‌ ఏర్పడుతుంది. మీకు సెల్యూట్‌. దేశానికి మీలాంటి టీచర్లే కావాలి’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని