Delhi: కొవిడ్‌ ఆంక్షల సడలింపు..!

కొవిడ్‌ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో నగరంలో ఆంక్షలను దిల్లీ సర్కారు సడలించింది. ఈ మేరకు శనివారం అధికారిక ప్రకటన చేసింది.

Updated : 29 Feb 2024 15:18 IST

దిల్లీ: కొవిడ్‌ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో నగరంలో ఆంక్షలను దిల్లీ సర్కారు సడలించింది. ఈ మేరకు శనివారం అధికారిక ప్రకటన చేసింది. సోమవారం ఉదయం 5 గంటల నుంచి సినిమా హాళ్లలో 50 శాతం, మెట్రో రైళ్లు, బస్సులను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపేందుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించింది.  కరోనా కట్టడిలో భాగంగా నిలిపివేసిన మెట్రో సేవలను దిల్లీ సర్కారు ఈ నెల 7న పునరుద్ధరించింది. ప్రస్తుతం అక్కడ మెట్రో రైళ్లు, బస్సులు 50 శాతం సామర్థ్యంతో నడుస్తున్నాయి. వివాహాలు, అంత్యక్రియలకు ప్రస్తుతం 50 మందిని మాత్రమే అనుమతిస్తుండగా ఈ సంఖ్యను ప్రభుత్వం 100 మందికి పెంచింది.

దిల్లీలో శుక్రవారం కొత్తగా 58 కేసులు నమోదు కాగా వైరస్‌తో ఒకరు మరణించారు. నగరంలో ప్రస్తుతం 573 క్రియాశీల కేసులున్నాయి. ఏప్రిల్‌ చివరి వారంలో 36 శాతానికి చేరుకున్న ఎన్‌ఫెక్షన్ రేటు.. ప్రస్తుతం 0.96 శాతానికి తగ్గడం ఊరటనిచ్చే అంశం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని