గీత దాటారు.. రూ.702 కోట్లు కట్టారు!

దిల్లీ అంటే దేశానికే రాజధాని.. చదువుకున్న వాళ్లూ ఎక్కువే. ట్రాఫిక్‌ నిబంధనలపై కూడా అవగాహన ఉంటుంది.

Published : 04 Jul 2021 01:39 IST

న్యూదిల్లీ: దిల్లీ అంటే దేశానికే రాజధాని.. చదువుకున్న వాళ్లూ ఎక్కువే. ట్రాఫిక్‌ నిబంధనలపై కూడా అవగాహన ఉంటుంది. అయినా ఏం లాభం? జనం ఎడాపెడా ‘గీత’ దాటేస్తూనే ఉన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రూల్స్‌ హద్దు మీరి ఆ నగర వాసులు ఒకటి కాదు.. రెండు కాదు.. ఈ పదేళ్లలో ఏకంగా రూ.702 కోట్లు జరిమానాగా చెల్లించారట. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. సమాచార హక్కు చట్టం ద్వారా ఓ సంస్థ అడిగితే ట్రాఫిక్‌ పోలీసులు వివరాలు వెల్లడించారు. జరిమానా రూపంలో వచ్చిన ఈ ఆదాయంతో దిల్లీ పోలీసు విభాగం సమస్త నిర్వహణకు అయ్యే ఖర్చులో 20శాతం అవసరాలు తీరాయట. ఈ మొత్తం డబ్బుని దిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ ఖాతాలో ఎప్పటికప్పుడు జమ చేస్తుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని