మెమొరీ పెంచుతానంటూ విద్యార్థులకు ఇంజెక్షన్‌!

జ్ఞాపకశక్తి పెరుగుతుందంటూ తన వద్దకు ట్యూషన్‌కు వచ్చే విద్యార్థులకు ఓ ట్యూటర్‌ ఇంజెక్షన్లు ఇస్తున్న ఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పు దిల్లీలోని మందవాలీకి చెందిన బీఏ చదువుతున్న విద్యార్థి సందీప్‌ (20) 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు....

Updated : 16 Feb 2021 04:15 IST

దిల్లీ: జ్ఞాపకశక్తి పెరుగుతుందంటూ తన వద్దకు ట్యూషన్‌కు వచ్చే విద్యార్థులకు ఓ ట్యూటర్‌ ఇంజెక్షన్లు ఇస్తున్న ఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పు దిల్లీలోని మందవాలీకి చెందిన బీఏ చదువుతున్న విద్యార్థి సందీప్‌ (20) 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ట్యూషన్‌ నిర్వహిస్తున్నాడు. అయితే, అతడు జ్ఞాపకశక్తి పెరుగుతుందని పేర్కొంటూ తన వద్దకు ట్యూషన్‌కి వచ్చే విద్యార్థులకు సెలైన్‌ బాటిల్‌లోని ద్రావణాన్ని ఇంజక్షన్‌గా ఇస్తున్నాడు. ఓ విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సందీప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించారు. అయితే, యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు చూశానని.. సెలైన్‌ ద్రావణంతో జ్ఞాపకశక్తి పెరుగుతుందని తెలుసుకొని విద్యార్థులకు ఇస్తున్నట్లు పోలీసులకు వెల్లడించాడు. సందీప్‌పై కేసు నమోదుచేసిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

ఇవీ చదవండి...

అత్యంత వేగంగా ఆవర్తన పట్టిక రాసి రికార్డు

వసూల్‌ రాజా-2 చిక్కాడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని