విశాఖలో తొలి డెల్టా వేరియంట్‌ కేసు

విశాఖ శివారులోని వాంబే కాలనీలో కరోనా డెల్టా వేరియంట్‌ కేసు నమోదైనట్టు అధికారులు ధ్రువీకరించారు. వాంబే కాలనీకి చెందిన 51 ఏళ్ల మహిళలో డెల్టా రకం వైరస్‌

Updated : 02 Jul 2021 11:34 IST

విశాఖపట్నం: విశాఖ శివారులోని వాంబే కాలనీలో కరోనా డెల్టా వేరియంట్‌ కేసు నమోదైనట్టు అధికారులు ధ్రువీకరించారు. వాంబే కాలనీకి చెందిన 51 ఏళ్ల మహిళలో డెల్టా రకం వైరస్‌ గుర్తించినట్టు డీఎంహెచ్‌వో సత్యనారాయణ వెల్లడించారు. గతేడాది కరోనా బారిన పడిన సదరు మహిళ హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్నారు. 

ఇటీవల కరోనా అనుమానంతో మధురవాడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లగా.. వైద్యులు పాజిటివ్‌గా తేల్చారు. ఆమె నమూనాలను హైదరాబాద్ పంపారు. ఆమెకు డెల్టా రకం వైరస్‌ సోకిందని నివేదిక వచ్చిందని గుర్తించారు. అప్రమత్తమైన జీవీఎంసీ అధికారులు బాధితురాలి నివాస పరిసరాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆమె కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగానే ఉన్నారని అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని