Dengue Fever: చిన్నారులకు డెంగీ వస్తే..! ఏం చేయాలో తెలుసా..?

దోమలు పెరిగాయంటే..వాటితో పాటే జబ్బులు వస్తాయి. మలేరియా కాస్త తగ్గినా ఇటీవల కాలంలో డెంగీ ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. పెద్దలు, పిల్లలు డెంగీ జ్వరంతో వణికిపోవాల్సి వస్తోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా జ్వరం పెరగడంతో చిన్నారులు అతులాకుతలం అవుతున్నారు. కొన్నిసార్లు ప్రమాదంలోకి నెట్టేస్తే..మరొకొన్నిసార్లు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

Published : 23 Sep 2022 02:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దోమలు పెరిగాయంటే..వాటితో పాటే జబ్బులు వస్తాయి. మలేరియా కాస్త తగ్గినా ఇటీవల కాలంలో డెంగీ ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. పెద్దలు, పిల్లలు డెంగీ జ్వరంతో వణికిపోవాల్సి వస్తోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా జ్వరం పెరగడంతో చిన్నారులు అతులాకుతలం అవుతున్నారు. కొన్నిసార్లు ప్రమాదంలోకి నెట్టేస్తే..మరొకొన్నిసార్లు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అయినా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ..జ్వరం వస్తే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. పిల్లలకు డెంగీ వస్తే ఏం చేయాలో చీఫ్‌ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ డాక్టర్‌ పి.వి.రామారావు వివరించారు.

జ్వరం ఎలా ఉంటుందంటే..

ఇది పగటి పూట కుట్టే దోమలతో వచ్చే వైరల్‌ ఫివర్‌. నాలుగైదు రోజులు జ్వరం, ఒళ్లునొప్పులు, కడుపులో నొప్పి ఉంటుంది. కొంతమందికి ఎర్ర మచ్చలు చర్మంపై వస్తాయి.

చికిత్స ఏం చేయాలంటే..

చిన్న పిల్లలకు పెద్దగా చికిత్స ఏమీ ఉండదు. జ్వరం వస్తే పారాసిటమాల్‌ సిరప్‌, మందు బిల్లలు ఇస్తే సరిపోతుంది.  ఎక్కువగా నీరు, పండ్లరసం తాగేలా చూడాలి. ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. అవసరమైతే రక్త పరీక్ష చేస్తే ఇబ్బందులుంటే తెలుసుకోవచ్చు. ప్లేట్‌లెట్లు బాగా తగ్గితేనే ఆసుపత్రిలో చేర్పించాలి.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని