Guntur: తెదేపా మహిళా నేత అరెస్టు.. పోలీసుల తీరును తప్పుబట్టిన న్యాయమూర్తి
ఓ మహిళను సోషల్‌మీడియా కేసులో గుంటూరు పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి రిమాండ్‌కు పెట్టడాన్ని గుంటూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజు కోర్టు మేజిస్ట్రేట్ జి.స్పందన తప్పుబట్టారు.
గుంటూరు: తండ్రి చనిపోయిన బాధలో అనారోగ్యం పాలైన ఓ మహిళను సోషల్‌మీడియా కేసులో గుంటూరు పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి రిమాండ్‌కు పెట్టడాన్ని గుంటూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజు కోర్టు మేజిస్ట్రేట్ జి.స్పందన తప్పుబట్టారు. కేసు దర్యాప్తు అధికారి ఈకేసులో సుప్రీంకోర్టు మారదర్శకాలను పాటించలేదని జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘‘ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో నిందితులను రిమాండ్‌కు పెట్టడం ఏమిటి? 41ఎ నోటీసులు ఇవ్వాలి కదా?’’ అని ప్రశ్నించి రిమాండ్‌కు పెట్టిన ఎస్సైను పిలవాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. నిందితురాలు శివపార్వతి రిమాండ్‌ను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. ఆమెను సొంతపూచీకత్తుపై విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
గుంటూరు విజయపురి కాలనీలో నివాసం ఉండే పిడికిటి శివపార్వతి (అలియాస్ లక్ష్మీ గణేష్) గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా మహిళా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కేసులో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అరెస్టు కావటంతో ఆ బాధలో ఉన్న ఆమెకు సోషల్‌మీడియాలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీరుకు వ్యతిరేకంగా వచ్చిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేశారు.
వైకాపా నాయకుల నుంచే ఫిర్యాదు
ముఖ్యమంత్రి ఫొటోను మార్ఫింగ్ చేసి పెట్టారని, తమ నాయకుడి గౌరవానికి భంగం కలిగేలా, రెచ్చగొట్టేలా ఆ వీడియోలు ఉన్నాయని ఫార్వర్డు చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని వైకాపా నేతలు ఫిర్యాదు చేశారు. గుంటూరు 42వ డివిజన్ ఇంఛార్జి చల్లా శేషిరెడ్డి, ఆపార్టీకే చెందిన పశ్చిమ నియోజకవర్గ సోషల్‌మీడియా కోఆర్డినేటర్ రాజవరపు జగదీష్, మరో అభిమాని షేక్ ఉస్మాన్ ఈనెల 25న ఇచ్చిన ఫిర్యాదులను అనుసరించి పట్టాభిపురం పోలీసులు 341, 342. 344 మూడు ఎఫ్‌ఐఆర్‌లు వేర్వేరుగా నమోదు చేసి శివపార్వతిపై 153, 502, 504, 505(2) ఐపీసీ సెక్షన్లు పెట్టారు. బుధవారం ఉదయం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి.. శివపార్వతి రిమాండ్‌ను తిరస్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
KRMB: సాగర్ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి: ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ
నాగార్జునసాగర్ కుడి కాలువ (Nagarjuna Sagar right canal) నుంచి నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశించింది. -
TTD: వైకుంఠద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు: ఈవో ధర్మారెడ్డి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Cyclone Michaung: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
Nagarjuna Sagar: సాగర్ వద్ద కొనసాగుతున్న పహారా.. ఏపీ పోలీసులపై కేసు నమోదు
నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) వద్ద పోలీసు పహారా కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యామ్‌పై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి దర్శనం చేసుకున్నారు. -
గ్రానైట్‌పై విద్యుత్తు పిడుగు
‘బాపట్ల జిల్లా మార్టూరులో 400, బల్లికురవలో 200, సంతమాగులూరులో 90, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 120, ప్రకాశం జిల్లాలో 800 వరకు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి.’ -
‘అన్ని మండలాల్లోనూ కరవు’
జిల్లావ్యాప్తంగా తీవ్ర దుర్భిక్షం నెలకొందని, తక్షణం అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవన్లో గురువారం సీపీఎం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/12/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 20,250 ఎగువన రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ
-
Biden: పన్నూ హత్యకు కుట్ర..భారత్‌కు ఏకంగా సీఐఏ చీఫ్‌ను పంపిన బైడెన్!
-
కాంగ్రెస్‌కు అచ్చేదిన్.. ఇది కూటమి విజయం: ఎగ్జిట్ పోల్స్‌పై సంజయ్ రౌత్
-
KRMB: సాగర్ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి: ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ
-
LPG Cylinder Price: వాణిజ్య సిలిండర్‌పై రూ.21 పెంపు
-
KCR: డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ భేటీ