Pawan Kalyan: సీజనల్‌ వ్యాధుల కట్టడిపై డిప్యూటీ సీఎం పవన్‌ సమీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్‌ వ్యాధుల వ్యాప్తి నిరోధం, ముందస్తు జాగ్రత్తలపై అసెబ్లీ కమిటీ హాల్‌లో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. 

Updated : 21 Jun 2024 17:04 IST

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్‌ వ్యాధుల కట్టడిపై అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ప్రశ్నలతో అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ సమావేశానికి వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌, పురపాలకశాఖ మంత్రి నారాయణ, సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తదితరులు హాజరయ్యారు. 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు వ్యవహరంపై అధికారులను పవన్‌ నిలదీశారు. స్థానిక సంస్థలకు నిధులు ఎందుకు ఇవ్వలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆ నిధులను సీఎఫ్ఎంఎస్ ఖాతాకు ఎంత మేర మళ్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విజయవాడలో డయేరియా కేసులు ఉత్పన్నం కావడానికి తాగునీటి సరఫరాలో లోపాలే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. మలేరియా సహా వివిధ రకాల అంటువ్యాధుల నివారణ, నీటి ద్వారా సంక్రమిత వ్యాధుల నియంత్రణ, సంసిద్ధతపై మంత్రులు, అధికారులతో చర్చించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని