
Published : 04 May 2021 13:17 IST
CID: విచారణకు మూడోసారి దేవినేని ఉమ
మంగళగిరి: వీడియో మార్ఫింగ్ చేశారన్న అభియోగంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సీఐడీ విచారణకు ఇవాళ మూడోసారి హాజరయ్యారు. మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి వచ్చిన ఆయన ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఆస్పత్రుల్లో ప్రజలు ఆక్సిజన్ కోసం అల్లాడుతుంటే సీఎం రాజకీయ కక్షతో ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ పేరుతో రోజుకు 9 గంటలకు పైగా ఖాళీగా కూర్చొబెడుతున్నారని మండిపడ్డారు.
ఇవీ చదవండి
Advertisement
Tags :