Samatha Murthy: సమతామూర్తి, 108 దివ్యదేశాల సందర్శనకు భక్తులకు అనుమతి

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న సమతాకేంద్రం, 108 దివ్యదేశాల సందర్శనకు రేపటి నుంచి భక్తులను అనుమతించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు దర్శనానికి అనుమతించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

Updated : 16 Feb 2022 05:02 IST

హైదరాబాద్‌: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న సమతాకేంద్రం, 108 దివ్యదేశాల సందర్శనకు రేపటి నుంచి భక్తులను అనుమతించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు దర్శనానికి అనుమతించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.  ప్రస్తుతానికి రామానుజాచార్యుల స్వర్ణమూర్తి దర్శనానికి అనుమతి లేదని పేర్కొన్నారు. సాంకేతిక కారణాలతో త్రీడీ మ్యాపింగ్‌ షో తాత్కాలికంగా నిలిపివేసినట్టు చెప్పారు. త్వరలో స్వర్ణమూర్తి దర్శనంతో పాటు త్రీడీ లేజర్‌షో అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.

ఈనెల 2 నుంచి 14 వరకు రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి సమతామూర్తిని దర్శించుకున్నారు. 13న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సమతా స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి రామానుజాచార్యుల స్వర్ణమూర్తిని లోకార్పణం చేశారు. సమతామూర్తి కేంద్రంలోని 108 దివ్యదేశాలలో సోమవారం జరగాల్సిన శాంతి కల్యాణోత్సవాలను సమయాభావం వల్ల ఈనెల 19న నిర్వహిస్తామని త్రిదండి చినజీయర్‌స్వామి తెలిపారు. 19న సాయంత్రం 108 ఆలయాల్లో ఒకేసారి కల్యాణం జరుగుతుందని, ఇంతవరకు ఇలా ఎక్కడా జరగలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని