AP News:ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం.. ఉత్సవమూర్తుల జలవిహారం రద్దు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై తొమ్మిదో రోజు దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.....

Updated : 15 Oct 2021 16:02 IST

విజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై తొమ్మిదో రోజు దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. నేడు పూర్ణాహుతితో ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. సాయంత్రం కృష్ణానది ఒడ్డున ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. నదిలో నీటి ఉద్ధృతి కారణంగా ఉత్సవ మూర్తులకు జలవిహారం రద్దుచేశారు. దసరా చివరి రోజు భారీగా భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే క్యూలైన్లలో భారీగా వేచిఉన్నారు. క్యూలైన్లలో ఆలస్యంకావడంతో పోలీసులతో భక్తులు వాగ్వాదానికి దిగారు. గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందంటూ ఆందోళన వ్యక్తంచేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు