Khairatabad Ganesh: ఖైరతాబాద్‌ గణేశుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. 

Updated : 24 Sep 2023 15:34 IST

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. దీంతో ఖైరతాబాద్‌ పరిసరాలు ఇసుకేస్తే రాలనంతగా మారాయి. 

ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌, ట్యాంక్‌బండ్‌, టెలిఫోన్‌ భవన్‌ వైపు నుంచి వచ్చేవారికి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలోనే భక్తులను అనుమతిస్తు్న్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈనెల 28న గణేశ్‌ నిమజ్జనం జరగనుంది. నిమజ్జనానికి ముందు వచ్చే ఆదివారం కావడంతో నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు నేడు భారీగా తరలివచ్చి 63 అడుగుల దశ మహా విద్యా గణపతిని దర్శించుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని