Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటలు!

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అక్టోబర్‌ 4 వరకు సాధారణంగా ఉన్న రద్దీ అక్టోబర్‌ 5 నుంచి క్రమంగా పెరిగింది.

Updated : 06 Oct 2022 15:11 IST

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అక్టోబర్‌ 4 వరకు సాధారణంగా ఉన్న రద్దీ.. అక్టోబర్‌ 5 నుంచి క్రమంగా పెరిగింది. పెరటాసి మాసం, రెండో శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో రద్దీ పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

గురువారం ఉదయం వైకుంఠం క్యూ కాంపెక్స్‌-2, నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్‌లు భక్తులతో నిండిపోయాయి. ఉదయం 11 గంటలకే క్యూలైన్లులో భక్తులు శిలా తోరణం వరకు చేరుకున్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతోంది. తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని తితిదే అధికారులు కోరారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts