Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 36 గంటలు

శ్రీవారి దర్శనానికి తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి.

Published : 16 Jun 2024 11:20 IST

తిరుమల: శ్రీవారి దర్శనానికి తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులుదీరారు. వీరికి శ్రీవారి దర్శనం కోసం 36 గంటల సమయం పడుతుందని తితిదే ప్రకటించింది. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. ఈ రద్దీ సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని