Chandrababu: త్వరలో పోలీసు యంత్రాంగం ప్రక్షాళన.. డీజీపీకి స్పష్టం చేసిన చంద్రబాబు

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమలరావు భేటీ అయ్యారు.

Published : 21 Jun 2024 17:40 IST

అమరావతి: సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమలరావు భేటీ అయ్యారు. బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో యువతి హత్య ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని డీజీపీ.. సీఎంకు వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. త్వరలోనే పోలీస్ యంత్రాంగం ప్రక్షాళన ఉంటుందని డీజీపీకి స్పష్టం చేశారు. ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని చంద్రబాబు వెల్లడించారు. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలిచ్చారు. ఈపూరుపాలెం ఘటనలో దోషులకు కఠిన శిక్ష పడేలా వ్యవహరించాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని