
TS NEWS: లాక్‌డౌన్‌తో తగ్గిన కేసులు
హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 2,261 కేసులు నమోదు కాగా, 18 మంది మరణించారని డీహెచ్ వెల్లడించారు. కరోనా బారి నుంచి నిన్న 3,043 మంది కోలుకున్నారని చెప్పారు. కరోనా పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గిందని వెల్లడించారు. గ్రామాల్లోనూ పకడ్బంధీగా లాక్డౌన్ అమలు కావాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి కరోనా పరిస్థితులపై ఆరా తీసినట్టు చెప్పారు. వచ్చే వారంలో కేసులు తగ్గితే లాక్డౌన్ ఎత్తివేసే అవకాశముందని డీహెచ్ వెల్లడించారు.
‘‘రాష్ట్రంలో ప్రస్తుతం 55వేలకు పైగా పడకలు అందుబాటులో ఉన్నాయి. రెండో విడతలో 87,49,549 ఇళ్లలో సర్వే పూర్తి చేశాం. సర్వేలో 4,037 మందికి కరోనా లక్షణాలున్నట్టు గుర్తించాం. కొన్ని చోట్ల మూడోదశ ఇంటింటి సర్వే చేస్తున్నాం. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఐపీఎంలో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం 9లక్షల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో 72, మేడ్చల్‌లో 48, రంగారెడ్డిలో 37 ఆసుపత్రులపై ఫిర్యాదులు వచ్చాయి’’ అని డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు.
రాష్ట్రంలో 1100 బ్లాక్ ఫంగస్ కేసులు
గత పదిరోజులుగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయని డీఎంఈ రమేష్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1100 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఉపయోగించే లీఫాసోమల్, అంఫోటెరిసిన్ మందుల కోసం రోగుల బంధువులు కాకుండా ఆసుపత్రుల ప్రతినిధులే కోఠిలోని ప్రజారోగ్య కార్యాలయానికి వచ్చి తీసుకోవాలని సూచించారు. సాధారణ అంఫోటెరిసిన్ కూడా బ్లాక్ ఫంగస్ బాధితులకు వాడాలని పేర్కొన్నారు. కొవిడ్ సోకిన పిల్లల్లో మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సమస్యలు వస్తున్నాయని, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైరస్ సోకిన చాలా తక్కువ మంది పిల్లల్లో మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Maharashtra: ‘మహా’ సంక్షోభంలో మరో మలుపు.. రెబల్ మంత్రుల శాఖలు వెనక్కి
-
Sports News
Wimbledon: వింబుల్డన్ టోర్నీ.. ఈ ప్రత్యేకతలు తెలుసా..?
-
India News
Sanjay Raut: శివసేనకు మరో షాక్.. సంజయ్‌రౌత్‌కు ఈడీ నోటీసులు
-
Politics News
KTR: యశ్వంత్ సిన్హాకు మద్దతు వెనక అనేక కారణాలు: కేటీఆర్
-
Crime News
Crime News: ఆస్పత్రికొచ్చిన గర్భిణిని పట్టించుకోకుండా పార్టీ.. గర్భంలోనే శిశువు మృతి!
-
India News
Presidential Election: నామినేషన్ వేసిన విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- చెరువు చేనైంది
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?