Diabetic Risk: కాలుష్యంతో మధుమేహం వస్తుందా? ఇందులో నిజమెంతో తెలుసుకోండి..!

చాప కింద నీరులా చాలా మందిని మధుమేహం చుట్టేస్తుంది. కొంతమందికి వారసత్వంగా వస్తే..ఎక్కువ మందికి జీవనశైలిలో మార్పులు, వ్యాయామం చేయకపోవడం, వాతావరణంలోని మార్పులతో టైప్‌-2 మధుమేహం వస్తోంది.  కాలుష్యంతో మధుమేహం వచ్చే ముప్పు పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.

Published : 13 Aug 2022 01:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాప కింద నీరులా చాలా మందిని మధుమేహం చుట్టేస్తోంది. కొంతమందికి వారసత్వంగా వస్తే.. ఎక్కువ మందికి జీవనశైలిలో మార్పులు, వ్యాయామం చేయకపోవడం, వాతావరణంలోని మార్పులతో టైప్‌-2 మధుమేహం వస్తోంది.  కాలుష్యంతో మధుమేహం వచ్చే ముప్పు పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. కాలుష్య కణాలు క్లోమగ్రంథి పనితీరును ప్రభావితం చేయడంతో షుగర్‌ వ్యాధి వస్తుందని సీనియర్‌ డయాబెటాలజిస్టు డాక్టర్‌ పీవీ రావు తెలిపారు.

కారణాలు ఇవే కాదు..

గతంలో అధిక బరువు, జంక్‌ఫుడ్‌, తీపి పదార్థాలు తినడం, వ్యాయామం చేయకపోవడంతో మధుమేహం వస్తుందని నిర్థారించారు. ఇపుడు కొత్తగా వాయు కాలుష్యంతో కూడా డయాబెటీస్‌ వస్తుందని పరిశీలనలో తేలింది. పరిశ్రమలు, వాహనాల కాలుష్యంతో పాటు ఇంట్లో వాడే వంట చెరుకు కూడా ఈ వ్యాధి రావడానికి కారణమవుతోంది. ఊపిరితిత్తులు, గుండె సంబంధ సమస్యలు వస్తున్నాయి. వీటితో పాటే షుగర్‌ జబ్బును పెంచుతున్నట్టు తేలింది.

జాగ్రత్తగా ఉండాల్సిందే!

వ్యర్థాల నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇనుము, ఇతర వ్యర్థాలను జన సమూహంలో ఉండకుండా జాగ్రత్తలు పాటించాల్సిందే. కాలుష్యం వస్తుందనే అనుమానం ఉన్నపుడు మాస్క్‌ పెట్టుకోవడంతోపాటు వాతావరణం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్లాస్టిక్‌ వినియోగించవద్దు. ప్రతి ఇంట్లో మొక్కలు పెంచాలి.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని