Health: మధుమేహులూ.. ఎండల్లో జాగ్రత్త సుమా!
ముదురుతున్న ఎండలతో మధుమేహులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇంటర్నెట్ డెస్క్: ఎండా కాలంలో మధుమేహులు చాలా జాగ్రత్తగా ఉండాలి. డీ హైడ్రేషన్, వడదెబ్బ ముప్పు నుంచి దూరంగా ఉండేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలపైకి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండాకాలంలో ప్రాణాధారమైన ఇన్సులిన్ పాడవ్వడమే కాకుండా శరీరంలోని వివిధ భాగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రయాణాలు చేయాల్సి వస్తే మరింత అప్రమత్తంగా ఉండాలని జనరల్ ఫిజిషియన్ వై.పూజిత తెలిపారు. మధుమేహుల ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు..
- మధుమేహులు డీ హైడ్రేషన్‌కు గురైతే రక్తం మరింత చిక్కపడి మరిన్ని చిక్కుల్లో పడేస్తుంది.
- వేసవిలో మధుమేహం ఉన్న వారు ఎక్కువగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంతవరకు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం ఎక్కువ సార్లు తాగాలి.
- మధుమేహులకు డీ హైడ్రేషన్‌తో యాసిడ్ ప్రొడక్షన్ కూడా పెరగొచ్చు. ఈ సమయంలో ఆయాసం రావడం, కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది.
- ప్రయాణం చేయడానికి ముందే రక్తంలో చక్కెర శాతం ఎలా ఉందో పరిశీలించుకోవాలి. మందులను వెంట తీసుకెళ్లాలి.
- ఇన్సులిన్‌ను జాగ్రత్తగా భద్రపర్చాలి. లేకుండా వేడికి పని చేయకుండా పోయే అవకాశం ఉంటుంది. 2-8 డిగ్రీల్లో నిల్వ చేయాలి. ఫ్రిజ్ పక్క డోరులో పెట్టాలి.
- కాళ్లకు చెప్పులు లేకుండా నడవొద్దు. కాళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. ఏ చిన్న గాయం కాకుండా చూసుకోవాలి.
- విమానంలో వెళ్లేవారు చెకింగ్ బ్యాగ్‌లో ఇన్సులిన్ పెట్టుకోవాలి.
- ప్రయాణం చేసే సమయంలో పాదాలను కిందికి పైకి కదిలించాలి. 8 గంటల కంటే ఎక్కువ సమయం ప్రయాణం ఉన్నపుడు ప్రతి రెండు గంటలకు ఓసారి లేచి నడవాలి. మంచినీరు, మజ్జిగను రెండు గంటలకోసారి గ్లాసు చొప్పున తాగాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా