Kakinada: కాకినాడ జిల్లా కొమ్మనాపల్లిలో ప్రబలిన అతిసారం

కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో అతిసారం ప్రబలింది. గ్రామంలో సుమారు 50 మంది అస్వస్థతకు గురయ్యారు.

Published : 14 Jun 2024 12:07 IST

తొండంగి: కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో అతిసారం ప్రబలింది. గ్రామంలో సుమారు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఐదుగురు బాధితులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతిసారం ప్రబలడానికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. గ్రామంలోని నీరు, ఆహార నమూనాలను పరిశీలిస్తున్నారు. పరిస్థితిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని