మాస్కు ఎందుకు పెట్టుకోవడంలేదంటే..!

కొవిడ్‌ కట్టడిలో భాగంగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, వ్యాక్సిన్‌ తీసుకోవడంపై ప్రభుత్వం, వైద్యులు ఎంత ప్రచారం చేసినా కొందరు మాత్రం ఇప్పటికీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు.

Published : 14 Jul 2021 01:23 IST

దిల్లీ: కొవిడ్‌ కట్టడిలో భాగంగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, వ్యాక్సిన్‌ తీసుకోవడంపై ప్రభుత్వం, వైద్యులు ఎంత ప్రచారం చేసినా కొందరు మాత్రం ఇప్పటికీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. చాలామంది మాస్కులు లేకుండానే సంచరిస్తున్నారు. అయితే వారంతా మాస్కులు ఎందుకు ధరించడం లేదనే అంశానికి సంబంధించి మూడు ముఖ్యమైన కారణాలు తెలుసుకునేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ సర్వే చేసింది. అందులో ప్రధానంగా ఎక్కువ మంది మాస్కులు ధరించకపోవడానికి ఈ కారణాలను వెల్లడించారు. మాస్కులు పెట్టుకుంటే తమకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని కొందరు చెప్పారు. మాస్కులు ధరించడం అసౌకర్యంగా ఉందంటూ మరికొందరు చెప్పారు. భౌతిక దూరం పాటించినంత కాలం తమకు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

మాస్కులు ధరించినంత మాత్రాన కొవిడ్‌ను అడ్డుకోలేమంటూ జరుగుతున్న అసత్య ప్రచారంపైనా కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే మూడో దశ ముప్పు తప్పదంటూ కేంద్రం చేసిన హెచ్చరికను పెడచెవిన పెడుతున్న ప్రజల నిర్లక్ష్య ధోరణిని సైతం ప్రత్యేకంగా ప్రస్తావించింది. ధర్డ్‌ వేవ్‌పై తాము చెబుతున్న అంశాలను వాతావరణ నివేదికలుగా కొందరు భావిస్తున్నట్లు తెలిపింది. 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని