
Amalapuram: కలెక్టరేట్‌కు వెళ్లే క్రమంలో విధ్వంసం సృష్టించారు: డీఐజీ పాలరాజు
అమలాపురం: కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన హింసాత్మక ఆందోళన వ్యవహారంలో ఇప్పటి వరకు 46 మందిని అరెస్ట్ చేశామని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు తెలిపారు. మరికొంతమందిని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆందోళనకారులను చెదరగొట్టామని.. కానీ 3 గంటల సమయంలో ఒక్కసారిగా వేలమంది రోడ్లపైకి వచ్చారన్నారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తామని చెప్తే వాళ్లను అక్కడికి పంపే క్రమంలో రాళ్లదాడి జరిగిందని.. వారిలో కొంతమంది విధ్వంసం సృష్టించారని చెప్పారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వివిధ జిల్లాల నుంచి సీనియర్ పోలీసు అధికారులను రప్పించామన్నారు.
అమలాపురంలో శాంతిని నెలకొల్పేందుకు అందరూ సహకరించాలని డీఐజీ పాలరాజు కోరారు. కమ్యూనిటీ లీడర్లతో మాట్లాడామని.. సంయమనం పాటించాలని చెప్పామన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని డీఐజీ సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana News: డిగ్రీ ప్రవేశాల కోసం... రేపే దోస్త్ నోటిఫికేషన్ విడుదల
-
General News
Health: పులిరాజా వెళ్లిపోలేదు.. జాగ్రత్త!
-
Movies News
Johnny Depp: డిస్నీ వరల్డ్‌లోకి జానీ డెప్.. రూ.2,535 కోట్ల ఆఫర్ నిజమేనా?
-
Crime News
Crime News: బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20ఏళ్ల జైలుశిక్ష
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Crime news: పట్టపగలే టైలర్ దారుణ హత్య.. ఉదయ్‌పూర్‌లో టెన్షన్.. టెన్షన్..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- నాకు మంచి భార్య కావాలి!
- Usa: అమెరికాలో వలస విషాదం : ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!
- Madhavan: ఇది కలా.. నిజమా! మాధవన్‌ను చూసి ఆశ్చర్యపోయిన సూర్య..!
- Mohan Babu: తిరుపతి కోర్టుకు నటుడు మోహన్‌బాబు
- Nambi Narayanan: దేశం కోసం శ్రమిస్తే దేశ ద్రోహిగా ముద్రవేశారు.. నంబి నారాయణన్ కథ ఇదీ!
- Andhra News: ఏపీ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో రూ.800 కోట్లు మాయం
- GHMC: భారీ వర్షం కురిసే అవకాశం... అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: జీహెచ్ఎంసీ