DIG Ravi Kiran: జైలులో రిమాండ్‌ ఖైదీ మృతి.. డీఐజీ ఏమన్నారంటే..

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీ గంజేటి వీర వెంకట సత్యనారాయణ మృతిపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ స్పందించారు.

Updated : 21 Sep 2023 13:23 IST

అమరావతి: రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీ గంజేటి వీర వెంకట సత్యనారాయణ మృతిపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ స్పందించారు. దోపిడీ కేసులో ఈనెల 6న సత్యనారాయణ జైలుకు వచ్చాడని.. జ్వరం, ప్లేట్‌లెట్లు లక్షన్నరకు పడిపోవడంతో 7న రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించామన్నారు. 

అత్యవసర వైద్య సహాయం కోసం ఈనెల 19న కాకినాడ జీజీహెచ్‌కు తరలించామని డీఐజీ చెప్పారు. డెంగ్యూతో రిమాండ్‌ ఖైదీ బుధవారం మృతిచెందారని తెలిపారు. జైలులో దోమల నివారణకు సంబంధిత శాఖతో కలిసి చర్యలు చేపట్టామన్నారు. ఫాగింగ్‌ చేశామని.. ఇవాళ కూడా చేస్తామని చెప్పారు. జైలులో దోమల లార్వా ఆనవాళ్లేమీ లేవని డీఐజీ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు