Telangana News: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటన.. 13 మందిపై ప్రభుత్వం చర్యలు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ (కు.ని) ఆపరేషన్ల ఘటనలో మహిళల మృతికి బాధ్యులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది...

Published : 24 Sep 2022 09:48 IST

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ (కు.ని) ఆపరేషన్ల ఘటనలో మహిళల మృతికి బాధ్యులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనకు సంబంధించి మొత్తంగా 13 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ఆగస్టు 25న ఇబ్రహీంపట్నంలో ఒక గంట వ్యవధిలోనే 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన విషయం తెలిసిందే. డీపీఎల్‌ శస్త్ర చికిత్స వికిటించి నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కమిటీ సిఫార్సు చేసింది.

కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన డాక్టర్‌ జోయల్‌ సునీల్‌కుమార్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి, డీసీహెచ్‌ఎస్‌ ఝాన్సీపై బదిలీ వేటు వేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కమిటీ పలు మార్గదర్శకాలు జారీ చేసినట్లు ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని