AP News: ఆంజ‌నేయుడి జ‌న్మ‌స్థలంపై చ‌ర్చ‌

ఆంజ‌నేయుడి జ‌న్మ‌స్థ‌లంపై వివాదం కొన‌సాగుతూనే ఉంది. అంజ‌నాద్రే ఆంజ‌నేయుడి జ‌న్మ‌స్థానం అంటూ శ్రీ‌రామ‌న‌వ‌మి ప‌ర్వ‌దినాన తితిదే చేసిన ప్ర‌క‌ట‌న ఖండిస్తూ ప‌లుమార్లు లేఖ రాసిన క‌ర్ణాట‌క‌లోని కిష్కింధ సంస్థానం నేడు చ‌ర్చ‌కు సిద్ధ‌మైంది.

Published : 27 May 2021 10:34 IST

తిరుమ‌ల‌: ఆంజ‌నేయుడి జ‌న్మ‌స్థ‌లంపై వివాదం కొన‌సాగుతూనే ఉంది. అంజ‌నాద్రే ఆంజ‌నేయుడి జ‌న్మ‌స్థానం అంటూ శ్రీ‌రామ‌న‌వ‌మి ప‌ర్వ‌దినాన తితిదే చేసిన ప్ర‌క‌ట‌న ఖండిస్తూ ప‌లుమార్లు లేఖ రాసిన క‌ర్ణాట‌క‌లోని కిష్కింధ సంస్థానం నేడు చ‌ర్చ‌కు సిద్ధ‌మైంది. తిరుప‌తి రాష్ట్రీయ సంస్కృత పీఠాన్ని ఇరు వ‌ర్గాలు సంవాదానికి వేదిక‌గా ఖ‌రారు చేశారు. తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శనం కోసం వ‌చ్చిన శ్రీ హనుమాత్ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర‌ ట్ర‌స్ట్ ఫౌండ‌ర్ ట్ర‌స్టీ శ్రీ‌గోవిందానంద స‌ర‌స్వ‌తి తితిదే క‌మిటీని చ‌ర్చ‌కు రావాల‌ని ఆహ్వానించారు.

ఈ చ‌ర్చ ద్వారా పంపా క్షేత్ర కిష్కింధ‌నే హనుమాన్ జ‌న్మ‌స్థ‌లంగా నిరూపించాల‌ని శ్రీ హనుమాత్ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర‌ ట్ర‌స్ట్ నిర్వ‌హ‌కులు నిశ్చ‌యించారు. దీనిపై తితిదేకు స‌మాచారం ఇవ్వ‌గా ఈ ఉద‌యం 10 గంట‌ల‌కు ఇరు వ‌ర్గాలు చ‌ర్చ‌ను ప్రారంభించాయి. చ‌ర్చ ముగిసిన అనంత‌రం వివ‌రాల‌ను మీడియాకు వెల్ల‌డించే అవ‌కాశం ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని