కృష్ణా కరకట్టపై ఫైళ్ల దహనం ఘటన.. ఓఎస్డీ రామారావు పాత్రపై చర్చ!

కృష్ణా నది కరకట్టపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) దస్త్రాల దహనం ఘటన వివాదాస్పదమవుతోంది. ఓఎస్డీ రామారావును పోలీసులు విచారణకు పిలిచారు. 

Published : 04 Jul 2024 14:31 IST

అమరావతి: కృష్ణా నది కరకట్టపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) దస్త్రాల దహనం ఘటన వివాదాస్పదమవుతోంది. దీనిలో పీసీబీ మాజీ ఛైర్మన్‌ సమీర్‌ శర్మ, ఓఎస్డీ రామారావు పాత్ర ఉందంటూ ఎక్సైజ్‌ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఓఎస్డీ రామారావును విచారణకు పిలిచారు. 

కరకట్టపై దస్త్రాల దహనం.. కొన్ని ఫైళ్లపై పెద్దిరెడ్డి ఫొటోలు

ఎక్సైజ్‌ శాఖలో రామారావు సుదీర్ఘకాలం పనిచేశారు. కొత్త ప్రభుత్వంలో ముఖ్యులకు తాను ఓఎస్డీగా వెళ్తున్నట్లు కొంతకాలంగా ఆయన చెప్పుకొంటున్నారు. ఇటీవల పీసీబీపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సమీక్ష సందర్భంగా తీసుకున్న ఫొటోతో ప్రచారం చేసుకుంటున్నారు. పవన్‌ సహా మరికొందరు మంత్రులకు తాను సన్నిహితమని ప్రచారం చేసుకుంటున్నట్లు ఎక్సైజ్‌శాఖలో చర్చ జరుగుతోంది. వైకాపా ప్రభుత్వంలో ముఖ్యులతో రామారావు అంటకాగారని.. ఎక్సైజ్‌ శాఖలో ఉద్యోగుల బదిలీలు, ఆర్వోఆర్‌ విషయాల్లో భారీ అక్రమాలకు తెరతీశారని ఆరోపణలు ఉన్నాయి. 2014-19 మధ్య ఆయన అక్రమాలపై సీఎం చంద్రబాబుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. తాజాగా ఫైళ్ల దహనం వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని