TTD: తిరుమలలో ఆగమశాస్త్రాన్ని విస్మరిస్తున్నారు: రమణ దీక్షితులు

తిరుమలలో ఆగమశాస్త్ర నియమాలను పాటించడం లేదని తితిదే మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఆరోపించారు.

Updated : 29 Jan 2023 18:36 IST

తిరుమల: ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని తితిదే (TTD) మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు (Ramana Dikshitulu) అన్నారు. తిరుమల (Tirumala)లో అధికారుల తీరుపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో ఆగమ నియమాలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.‘‘ తిరుమలలో ఆగమశాస్త్ర నియమాలు పాటించడం లేదు. శాస్త్ర నియమాలకు విరుద్ధంగా పని చేస్తున్నారు. సొంత ప్రణాళిక ప్రకారం తితిదే అధికారులు వ్యవహరిస్తున్నారు. ధనికులైన భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వీఐపీల సేవలో అధికారులు తరిస్తున్నారు.’’ అని రమణ దీక్షితులు ట్విటర్‌లో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని