
Krishnpatnam: ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభం
కృష్ణపట్నం: నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుకు ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో ఇవాళ పంపిణీ చేపట్టారు. సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రజలకు ఔషధాన్ని ఇస్తున్నారు. క్యూలో నిల్చున్న వారికి ఇబ్బందులు లేకుండా ఆనందయ్య సోదరుడు, బృందం మందును పంపిణీ చేస్తున్నారు. ఈ ఔషధం కోసం నియోజకవర్గం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆనందయ్య మాట్లాడుతూ.. తొలుత సర్వేపల్లి నియోజకవర్గంలోని ఇంటింటికీ ఔషధం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర ప్రాంతాల వారికి తర్వాత ఇస్తామని.. ఇక్కడకు వచ్చి ఇబ్బందులు పడొద్దని సూచించారు.
ఆనందయ్య మందుకు డిమాండ్ పెరిగి భారీగా ప్రజలు రావడంతో పాటు ఆయుష్ అనుమతి కోసం గత నెల 21న మందు పంపిణీని ఆపేశారు. ఆయుష్ నివేదిక ప్రకారం ఐ డ్రాప్స్ మినహా మిగతా రకాల మందులకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఇవాళ పంపిణీని తిరిగి ప్రారంభించారు.
ఇవీ చదవండి
Advertisement