Harish Rao: త్వరలోనే 80వేల ప్రభుత్వ ఉద్యోగాలు: హరీశ్‌రావు

వైద్యరంగంలో అత్యంత పారదర్శకంగా నియామకాలు జరగుతున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు.

Updated : 22 May 2023 17:28 IST

హైదరాబాద్‌: వైద్యరంగంలో అత్యంత పారదర్శకంగా నియామకాలు జరగుతున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. కొత్తగా ఎంపికైన 1061 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు హరీశ్‌ నియామకపత్రాలు అందజేశారు. శిల్పకళా వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైద్య విద్యలో దేశంలోనే ఇది ఒక రికార్డు అని చెప్పారు. 80వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ మొదలుపెట్టామని, అందులో భాగంగానే తాజాగా 1061 పోస్టులు భర్తీ చేశామని అన్నారు. 1,331 మంది ఆయుష్‌ కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించామన్నారు.

‘‘తెలంగాణ ఏర్పడిన తరువాత 22,263 మందికి ఆరోగ్యశాఖలో ఉద్యోగాలిచ్చాం. మరో 9,222 పోస్ట్‌లకు రెండు నెలల్లో నోటిఫికేషన్‌ ఇస్తాం. రోగుల ఆరోగ్యాన్నీ నయం చేయగల శక్తి వైద్యులకు ఉంటుంది. వైద్యులు సమాజానికి మంచి సేవలు అందించాలి. వచ్చే నెల నుంచి టి డియాగ్నస్టిక్స్‌లో 134 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. ప్రస్తుతం 54 పరీక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రధానమంత్రి మోదీ రాష్ట్రానికి ఒక ఎయిమ్స్‌ ఇచ్చినందుకు భాజపా నేతలు చాలా హడావుడి చేశారు. భారాస ఒకే ఏడాదిలో తొమ్మిది కాలేజీలు ఏర్పాటు చేసింది. ఒక్కో మెడికల్ కాలేజీకి సుమారు రూ. 500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ప్రతి లక్ష మందికి 22 ఎంబీబీఎస్‌ సీట్లతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది’’ అని హరీశ్‌ రావు వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని