పారదర్శకంగానే టీకాల కేటాయింపు: కేంద్రం

జనసంఖ్య, కేసుల పెరుగుదల, టీకాల వృథా నియంత్రణ ప్రాతిపదికగానే రాష్ట్రాలకు కొవిడ్‌ వ్యాక్సిన్లను కేటాయిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

Published : 24 Jun 2021 18:04 IST

దిల్లీ: జనసంఖ్య, కేసుల పెరుగుదల, టీకాల వృథా నియంత్రణ ప్రాతిపదికగానే రాష్ట్రాలకు కొవిడ్‌ వ్యాక్సిన్లను కేటాయిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. కొవిడ్ 19 వ్యాక్సిన్లను రాష్ట్రాలకు పారదర్శకంగా కేటాయించలేదని వచ్చిన మీడియా కథనాలను, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నిరాధారమైనవిగా పేర్కొంటూ కొట్టిపారేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) మార్గదర్శకాల ఆధారంగానే భారత్‌లో టీకా పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. క్రమబద్ధమైన ప్రణాళికను అనుసరిస్తూ.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమర్థమైన భాగస్వామ్యం ద్వారా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నామని గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని