Diabetes: బెరియాట్రిక్‌ సర్జరీతో మధుమేహం దూరం

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నపుడు కొంతమంది పొట్టను తగ్గించుకోవడానికి సిద్ధమవుతారు. వ్యాయామం చేయడం, భోజనం తగ్గించినా పొట్ట ఇంచుకూడా తగ్గకపోవడంతో బెరియాట్రిక్‌ సర్జరీకి వెళ్తారు. అలా వెళ్లిన వారికి మధుమేహం కూడా పూర్తిగా తగ్గిపోతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మందులు ఏ మాత్రం వాడాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు.

Published : 02 Oct 2022 01:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నపుడు కొంతమంది పొట్టను తగ్గించుకోవడానికి సిద్ధమవుతారు. వ్యాయామం చేయడం, భోజనం తగ్గించినా పొట్ట ఇంచుకూడా తగ్గకపోవడంతో బెరియాట్రిక్‌ సర్జరీకి వెళ్తారు. అలా వెళ్లిన వారికి మధుమేహం కూడా పూర్తిగా తగ్గిపోతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మందులు ఏ మాత్రం వాడాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. ఈ సర్జరీ తీరుతెన్నులు, ప్రయోజనాలను సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్‌ మహీధర్‌ వలేటి వివరించారు.

షుగర్‌ ఎలా తగ్గుతుందంటే...!

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నాను..120-150 కిలోలున్నాను..సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉందా అని చాలా మంది అడుగుతుంటారు. ఇలాంటి వారికి మధుమేహం ఎక్కువగా వస్తుంది. వీళ్లకు చేసే బెరియాట్రిక్‌ సర్జరీతో చాలా మంది బరువుతగ్గుతారు. ఆపరేషన్‌ చేసిన తర్వాత కొన్ని నెలల్లో బరువు తగ్గడంతో మధుమేహం కూడా తగ్గుతుంది. దాదాపుగా 70-80 శాతం మందికి పూర్తిగా మధుమేహం తగ్గినట్టు గుర్తించాం. 
వాళ్లకు షుగర్‌ మందులు వాడాల్సిన అవసరం లేకుండా పోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని