Andhra news: పాస్ పుస్తకాలు, ధ్రువీకరణ పత్రాలపై ఫొటోలు, రాజకీయ రంగులు ఉండొద్దు

గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

Published : 18 Jun 2024 21:26 IST

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన లోగోలు, సర్టిఫికెట్లు జారీ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. పాస్ పుస్తకాలు, ధ్రువీకరణ పత్రాల్లో ఎలాంటి ఫొటోలు, రంగులు, రాజకీయ పార్టీ జెండాలు ఉండేందుకు వీల్లేదని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

2019-24 మధ్య అమలు చేసిన కొన్ని పథకాలకు పేర్లు మార్చామని ఆమేరకు ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించింది. గత ప్రభుత్వంలో పథకాలకు ఉన్న పేర్లను తక్షణం తొలగించాలని సూచించింది. కొత్త పేర్లు ఖరారు చేసేంత వరకూ సదరు పథకాల జనరల్‌ పేర్లను కొనసాగించాలని స్పష్టం చేసింది. పార్టీ రంగులు, జెండాలతో ఉండే ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లు, పాస్ పుస్తకాలు, లబ్ధిదారుల పుస్తకాలు, ధ్రువీకరణ పత్రాలను నిలిపివేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. ధ్రువీకరణ పత్రాలు, పాస్ పుస్తకాలు, ఇతర పత్రాలు జారీ చేయాల్సిన నమూనాలను కూడా జతపరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల్లో ఎలాంటి మార్పులు జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఈమేరకు కార్యదర్శులు, హెచ్ఓడీలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు