
నిద్రపోయే ముందు వీటికి దూరం!!
ఇంటర్నెట్ డెస్క్: కాలంతో పాటు మనుషుల జీవనశైలి, ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. సమయంతో సంబంధం లేకుండా ఆహారం తీసుకుంటున్నారు.. అర్ధరాత్రి దాటినా నిద్రపోవట్లేదు. సరే, వృత్తిపరంగా.. ఇతర కారణాల వల్ల ఇవన్నీ తప్పదనుకున్నా చక్కటి నిద్ర.. ఆరోగ్యం ముఖ్యం కదా..! అనేక మంది రాత్రిపూట భోజనం చేసిన తర్వాత చాలాసేపటికి నిద్రపోతారు. ఈ మధ్య సమయంలో చేసే కొన్ని పనులు నిద్రకు భంగం కలిగించడమే కాదు.. అనారోగ్యానికి దారితీసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ చేయకూడని పనులేవో.. తెలుసుకొని, వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి.
టీ, కాఫీ, చాక్లెట్
చాలా మంది పగటిపూట పలుమార్లు టీ, కాఫీ తాగుతుంటారు. దీంతో ఇబ్బంది లేదు.. అయితే, కొంతమంది రాత్రి పడుకునేముందు టీ, కాఫీ తాగడానికి ఇష్టపడతారు. రాత్రుళ్లు ఉద్యోగాలు చేసేవారైతే.. తప్పదు అనుకోవచ్చు. కానీ, రోజంతా వివిధ పనులు చేసి హాయిగా నిద్రపోవాల్సిన వాళ్లు కూడా తినగానే టీ, కాఫీ తాగుతుంటారు. మరికొంతమంది చాక్లెట్లు తింటుంటారు. ఈ అలవాట్లు మంచివి కావు. టీ, కాఫీ, చాక్లెట్లలో కెఫిన్ ఉంటుంది. ఇది మనుషుల నిద్రకు ఆటంకం కలిగించడంతో పాటు నిద్రకు సంబంధించి అనేక సమస్యలకు కారణమవుతుంది. అందుకే తిన్న తర్వాత.. పడుకునే ముందు వీటిని తీసుకోవద్దు.
సృజనాత్మక పనులు వద్దు
తిన్న తర్వాత నిద్రవచ్చే వరకు కాస్త ఖాళీ సమయం దొరికింది కదా అని కొంత మంది కొత్త విద్యలు నేర్చుకోవడం, రాయడం, డ్రాయింగ్ వేయడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి సృజనాత్మక పనులు చేసే సమయంలో మెదడుపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు నిద్ర వచ్చే అవకాశం ఎక్కడిది? మెదడుకు పని తగలడంతో నిద్ర రాదు. సరిగా నిద్రపోకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఇలాంటి పనులకు దూరంగా ఉండండి. మెదడుకు కాస్త విశ్రాంతి ఇవ్వండి. అప్పుడే హాయిగా నిద్రపోగలరు.
ఎక్కువగా నీరు తాగొద్దు
పగటిపూట ఎంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిది. శరీరం నిర్జలీకరణం కాకుండా ఉండాలంటే నీరు తాగాల్సిందే. అయితే రాత్రులు ఈ విధానం వర్తించదు. రాత్రి 8 గంటల తర్వాత తక్కువ నీరు తాగడమే ఉత్తమం. ఎక్కువగా తాగడం వల్ల అర్ధరాత్రి పలుమార్లు మూత్రం వెళ్లాల్సి రావొచ్చు. దీంతో చక్కటి నిద్రకు భంగం వాటిల్లుతుంది. ఈ సమస్యలు రావొద్దంటే రాత్రిపూట నీరు ఎక్కువగా తాగకండి.
వ్యాయామం.. స్నానం
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. వ్యాయామం శరీరాన్ని దృఢంగా మార్చడంతోపాటు మానసికంగానూ ఉత్సాహం కలిగిస్తుంది. వ్యాయామానికి ఉదయమే సరైన సమయం. కొంతమందికి ఉదయం వీలుకుదరక సాయంత్రం పూట చేస్తారు. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ, కొంతమంది రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు వ్యాయామం చేస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదు. పడుకునే ముందు వ్యాయామం చేయడం వల్ల శరీరం యాక్టివ్‌గా మారుతుంది. మరికొంతమంది వేణ్నీళ్లతో స్నానం చేస్తారు. అలా చేస్తే శరీరంలోని నరాలు క్రియశీలకంగా పనిచేస్తాయి. శరీరానికి అలసట బదులు ఉత్సాహం వస్తుంది. దీంతో త్వరగా నిద్ర పట్టదు.
భోజనం.. ఐస్‌క్రీమ్
చాలామంది తినగానే పడకెక్కి నిద్రకి ఉపక్రమిస్తుంటారు. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం అంత సులభంగా జీర్ణం కాదు. పొట్ట భారంగా మారి ఇబ్బంది పెడుతుంది. కొన్నిసార్లు ఛాతిలో మంటగానూ ఉండొచ్చు. కారం ఎక్కువగా ఉండే ఆహారం తింటే ఎసిడిటీ సమస్యలు వస్తాయి. సరిగా నిద్ర పట్టదు. కాబట్టి నిద్రపోవడానికి నాలుగు గంటల ముందు ఆహారం తీసుకోవడం ఉత్తమం.
డిజిటల్ టెక్నాలజీకి దూరం
ఎక్కువ మంది రాత్రుళ్లు మొబైల్ఫోన్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూసుకుంటూ నిద్రపోవాలన్న సంగతే మర్చిపోతున్నారు. నిజానికి, దీనికి కారణం మొబైల్‌ఫోన్ వెలుతురు. తెరపై కనిపించే నీలం, తెలుపు వెలుగు మెదడులో మెలటోనిన్ అనే హర్మోన్‌ను విడుదల చేయకుండా నిలువరిస్తుంది. దీంతో నిద్రపట్టదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Maharashtra: ‘మహా’ సంక్షోభంలో మరో మలుపు.. రెబల్ మంత్రుల శాఖలు వెనక్కి
-
Sports News
Wimbledon: వింబుల్డన్ టోర్నీ.. ఈ ప్రత్యేకతలు తెలుసా..?
-
India News
Sanjay Raut: శివసేనకు మరో షాక్.. సంజయ్‌రౌత్‌కు ఈడీ నోటీసులు
-
Politics News
KTR: యశ్వంత్ సిన్హాకు మద్దతు వెనక అనేక కారణాలు: కేటీఆర్
-
Crime News
Crime News: ఆస్పత్రికొచ్చిన గర్భిణిని పట్టించుకోకుండా పార్టీ.. గర్భంలోనే శిశువు మృతి!
-
India News
Presidential Election: నామినేషన్ వేసిన విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- చెరువు చేనైంది
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27-06-2022)