Spinal Anesthesia: వెన్నుకు మత్తు మందు ఇస్తే నడుంనొప్పి వస్తుందా..? ఇందులో నిజం లేదంటున్న వైద్యులు

మగవారు రకరకాల పనులు చేయడంతో నడుంనొప్పి వస్తుందని చెబుతారు. అదే ఆడవాళ్లకయితే ప్రసవంతోనో.. ఆపరేషన్‌ సమయంలోనో వెన్నుకు ఇచ్చే మత్తు మందుతో నడుంనొప్పి వస్తుందని అనుకుంటారు.

Published : 05 Oct 2022 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మగవారు రకరకాల పనులు చేయడంతో నడుంనొప్పి వస్తుందని చెబుతారు. అదే ఆడవాళ్లకయితే ప్రసవంతోనో.. ఆపరేషన్‌ సమయంలోనో వెన్నుకు ఇచ్చే మత్తు మందుతో నడుంనొప్పి వస్తుందని అనుకుంటారు. నిజానికి ఇది అపోహ మాత్రమేనని వైద్యులు కొట్టిపడేస్తున్నారు. మహిళలు గర్భం దాల్చడం, ఆపరేషన్లు కావడంతో పాటు ఇంట్లో, ఉద్యోగ విధుల్లో విశ్రాంతి లేకుండా ఉండటంతోనే నడుంనొప్పి వస్తుందని సర్జికల్‌ జీఐ అండ్‌ లాప్రోస్కోపిక్‌ సర్జన్‌ డాక్టర్‌ సుజీత్‌కుమార్‌ పేర్కొన్నారు. 

ఎలాంటి ఇబ్బందులుండవు..

* రోజూ కొన్ని వేల సర్జరీలు అవుతున్నాయి. అందరికీ ఇబ్బందులు ఏర్పడితే ఎన్నో సమస్యలు వచ్చేవి. ఇది కేవలం అపోహ మాత్రమేనని గుర్తించాలి.

* ఆపరేషన్‌ అనేది సమస్య నుంచి బయట పడేసేందుకు చేసేదే తప్ప ఇబ్బందుల్లో నెట్టేందుకు కాదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని