Published : 26 May 2022 01:19 IST

Health: హెడ్‌ఫోన్స్‌తో వినికిడి సమస్య నిజమేనా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటే చెవిలో ఇయర్‌, హెడ్‌ఫోన్‌ ఉండాల్సిందే..చిన్నారుల నుంచి మొదలు పెద్దల దాకా ఆటా, పాటా, మాటా వినేందుకు ఆసక్తి చూపిస్తారు. కొందరు కుర్రకారులైతే ఇయర్‌బడ్స్‌ పెట్టుకొని సినిమాలే చూస్తున్నారు. చెవిలో ఇయర్‌ ఫోన్‌ పెట్టుకొని ప్రమాదాల బారిన సంఘటనలున్నాయి. ఇయర్‌ఫోన్స్‌తో వినికిడి శక్తి కూడా బాగా తగ్గిపోతుందని, కొంతమందికి పూర్తిగా చెవుడు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈఎన్‌టీ సర్జన్‌ జానకి రామిరెడ్డి వివరించారు.

ఈ లక్షణాలు గమనించాలి: చెవులు బరువుగా అనిపించడం, చెవిలో నొప్పిగా ఉండటం, కుయ్‌ లాంటి శబ్దం వినిపించడం లేదా సముద్రపు ఘోష చెవిలో వినిపించినా వైద్యుల వద్దకు వెళ్లాలి. 

వినికిడి సమస్య ఎందుకు: వినికిడి సమస్య పెద్దగా ఉండదు. కానీ శబ్దంలోని స్పష్టత లోపిస్తుంది. పిట్టల అరుపులు, కాళ్ల గజ్జల శబ్దం సరిగా వినిపించదు. అసలు వినిపించలేదని వీళ్లు భావించరు. ఎందుకంటే పెద్ద శబ్దాలను సులువుగానే వింటారు. క్రమేపి చిన్న శబ్దాలు దూరం అవుతాయి. ఎస్‌, ఎఫ్‌ అక్షరాల శబ్దం అర్థం కాదు. 

తప్పనిసరయితే: ఖచ్చితంగా హెడ్‌ఫోన్‌ వినియోగించక తప్పదు. ఉద్యోగం దానిపైనే ఆధార పడుతుందని భావించిన సమయంలో 80 డెసిబుల్స్‌ కంటే శబ్దం ఎక్కువగా ఉండొద్దు. గంట కంటే ఎక్కువ సేపు వాటిని వాడొద్దు. రోజూ గంటలకొద్ది హెడ్‌ఫోన్‌ వాడాల్సి వస్తే మాత్రం 8 నెలలకోసారి చెవి పరీక్ష చేయించుకోవాలి. ఒకసారి చెవిలోపలి భాగం దెబ్బతింటే మళ్లీ వెనక్కి తీసుకొని రాలేం. అందుకే జాగ్రత్తగా ఉండాలి. 


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని